అసెంబ్లీలో ఎమ్మెల్యేల నిద్ర.... యోగి ఆధిత్యనాథ్ కు అవమానం..

 

సాధారణంగా ఏ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరిగినా అధికార పక్ష, విపక్ష నాయకుల వాదలతో సభ దద్దరిల్లుతుంటుంది. కానీ ఇంత గొడవ జరుగుతున్నా కానీ ఇవేమి పట్టనట్టు కొంతమంది నిద్రకు ఉపక్రమిస్తుంటారు. అలా చాలామంది నాయకులే ఇప్పటివరకూ బుక్కయ్యారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా అలా నిద్రపోయి కెమెరా కంటికి చిక్కి బుక్కయ్యాడు. ఇంతకీ ఏ అసెంబ్లీ.. ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటున్నారా...? వివరాల ప్రకారం..లక్నోలోని లోక్ భవన్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జీఎస్టీ బిల్లుపై చర్చ జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాలన్ని మొదటిసారి లైవ్ టెలికాస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాము ఎన్నుకున్న నేతలు ఎలా పనిచేస్తున్నారో తెలుసుకేందుకు యోగి ఈ ఆలోచన చేశారు. అయితే టీవీల ముందు కూర్చుని చూసిన జనాలకి మాత్రం షాకింగ్ సీన్లు దర్శనమిచ్చాయి. ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కొందరు ఎమ్మెల్యేలు ఎంచక్కా కూర్చున్న సీట్లలోనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు యోగి ఆదిత్య‌నాథ్ విమ‌ర్శ‌లు ఎదుర్కునే ప‌రిస్థితి వ‌చ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu