దూకుడు మీద స్టాక్ మార్కెట్లు...
posted on May 16, 2017 4:01PM
.png)
స్టాక్ మార్కెట్లు ఈరోజు ప్రారంభం నుండే మంచి దూకుడుమీద ఉన్నాయి. ప్రారంభం నుండే సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో నడుస్తుండగా.. మార్కెట్ ముగిసే సమయానికి కూడా అదే హవా సాగించాయి. మొదటిసారి నిఫ్టీ 9,500 పాయింట్లను అధిగమించింది. 2017సం.రంలో 1300 పాయింట్ల మేర నిఫ్టీ బంపర్ ర్యాలీ అయింది. సెన్సెక్స్ కూడా కీలకమైన మద్దతుస్థాయి 30,500 స్థాయిని దాటడం విశేషం. చివరికి సెన్సెక్స్ 260 పాయింట్లు ఎగిసి 30,582 వద్ద, నిఫ్టీ 67 పాయింట్ల జూమ్ అయ్యి 9512 వద్ద ముగిశాయి.
ఏసీసీ, భారతి ఎయిర్‌టెల్, హీరో మోటో, మారుతి, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్, టీసీఎస్, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ లాభాల్లోనూ జీ, ఐబీ హౌసింగ్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, కొటక్ బ్యాంక్, హిందాల్కో, సిప్లా, సన్ ఫార్మా, అదానీపోర్ట్స్ నష్టాల్లోనూ ముగిశాయి.