చెరువులో దిగి ఇద్దరు యువతులు మృతి

 

భద్రాచలం మండలం కొత్తూరు నారాయణపురం చెరువులో కలువ పూలు కోసుకోవడానికి దిగిన ఇద్దరు యువతులు నీట మునిగి మరణించారు. భద్రాచలంలోని జగదీష్ కాలనీకి చెందిన సారిక (18), అఖిల (16) బతుకమ్మ తయారు చేయడం కోసం పూల సేకరణకు వెళ్ళారు. కలువ పూల కోసం చెరువులో దిగి నీటిలో మునిగిపోయి మరణించారు. వీరిలో సారిక మ‌ృతదేహాన్ని గజ ఈతగాళ్ళు బయటకి తీశారు. అఖిల మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu