గుర్తింపు పొందని పవన్ కళ్యాణ్ జనసేన...
posted on Sep 26, 2014 2:24PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన జనసేనను రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికల కమిషన్ తాజాగా విడుదల చేసిన జాబితాలో జనసేన పార్టీ పేరు కనిపించలేదు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైసీపీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించింది. తెలంగాణ రాష్ట్రంలో అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని ఎంఐఎం గుర్తింపు పార్టీగా అవతరించింది.బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా పొందాయి. మరి తన పార్టీకి గుర్తింపు రాకపోవడం పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.