గోపీచంద్ లౌక్యం మూవీ రివ్యూ..

 

తారాగణం: గోపీచంద్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, పోసాని కృష్ణమురళి, చంద్రమోహన్‌, బ్రహ్మానందం, ముఖేష్‌ రుషి, రఘుబాబు.

 

సాంకేతిక నిపుణులు: కెమెరా: వెట్రి, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: కోన వెంకట్‌, గోపీమోహన్‌, స్క్రీన్‌ప్లే, కోన వెంకట్‌, కథ: శ్రీధర్‌ సిపాన, దర్శకత్వం: శ్రీవాస్‌, నిర్మాత: ఆనంద్‌ ప్రసాద్.

 

వరంగల్‌లో బాబ్జీ అనే రౌడీ చెల్లెలి పెండ్లికి సిద్ధమవుతుండగా తీసుకెళ్తాడు వెంకటేశ్వర్లు (గోపీచంద్‌). ఆమెని తాను ప్రేమించిన వ్యక్తి చేతిలో పెడతాడు. దాంతో బాబ్జీ తన చెల్లెలి మీద ప్రేమతో తీసుకువెళ్ళిన వాడిపై కసితో ఊరంతా అనుచరులతో వెతుక్కుంటూ హైదరాబాద్‌కు వస్తాడు. అక్కడ సెల్ఫీ (బ్రహ్మానందం) కారులోనే ట్రావెల్‌ చేస్తూ తిరుగుతుంటారు. ఈలోగా బాబ్జీ మరో చెల్లెలు చంద్రకళ (రకుల్‌ ప్రీత్‌సింగ్‌) తొలిచూపులోనే ప్రేమలో పడతాడు వెంకటేశ్వర్లు. బాబ్జీ ప్రత్యర్థులు ముఖేష్‌రుసి ఓరోజు చంద్రకళపై ఎటాక్‌ చేస్తారు. ఇది తెలిసిన బాబ్జీ తన ఇంటికి తీసుకువచ్చి.. తననుక్ను భరత్‌కు ఇచ్చి పెండ్లి చేయాలనుకుంటాడు. మరి హీరో ఊరుకుంటాడా? అందరినీ బురిడీ కొట్టించి తన తెలివితేటలతో(లౌక్యం) ఎలా సాల్వ్‌ చేశాడు? అన్నది తర్వాతి కథ.

 

సినిమా మొదటి నుంచి చివరి వరకు హాస్యంతో వున్న ఈ సినిమాని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. గోపీచంద్ సరికొత్త నటనను ప్రదర్శించాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu