టీటీడీని అప్రతిష్ట పాలు చేసింది వైసీపీనే : భానుప్రకాష్ రెడ్డి
posted on Jul 12, 2025 3:24PM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తిరుమలలో చేసిన వ్యాఖ్యల పై దుమారం రేపుతోంది. టీటీలో వెయ్యి మంది వరకు అన్యమతస్తులు ఉన్నారని చేసిన వ్యాఖ్యలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. కరుణాకర్ రెడ్డి మాటల పై టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి స్పందించారు. టీటీడీ ని అప్రదిష్ట పాలి చేసింది వైసీపీ అన్నారు. ప్రతి ఉద్యోగి ఇంటికి వెళ్ళి పరిశీలనకు బోర్డు సమావేశం లో చర్చించనున్నట్లు తెలిపారు.
మరోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలను టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఖండించారు. తిరుమల నుంచి దేవాదాయశాఖకు సంబంధించిన ప్రక్షాళన ప్రారంభం కావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీటీడీ ఉద్యోగులు అర్చకుల సమస్యలు, భక్తులకు మెరుగైన సేవలందించేందుకు నేడు సమావేశం నిర్వహిస్తున్నట్టు మంత్రి ఆనం తెలిపారు