శ్రీకృష్ణ శోభాయాత్రలో విషాదం.. విద్యుదాఘాతంలో ఐదుగురు మృతి

ఉత్సాహంగా సాగుతున్న శ్రీకృష్ణ శోభాయాత్రలో ఘోర విషాదం సంభవించింది. ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రామంతాపూర్ గోకులే నగర్ లో శ్రీకృష్ణ శోభాయాత్ర జరుగుతుండగా విద్యత్ షాక్ కు గురై ఐదుగురు మృత్యువాత పడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.  

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా  ఆదివారం (ఆగస్టు 17) శ్రీకృష్ణ శోభాయాత్ర నిర్వహించారు. ఊరేగింపు సమయంలో రథాన్ని తీసుకెళ్లే వాహనం సాంకేతిక కారణాలతో నిలిచిపోయింది. దీంతో  పది మంది రథాన్ని నెడుతున్న క్రమంలో   విద్యుత్ తీగలు రథానికి తాకడంతో ఈ ఘోరం జరిగింది.  విద్యుదాఘాతంలో మరణించిన వారిని  కృష్ణ అలియాస్ డైమండ్ యాదవ్ శ్రీకాంత్ రెడ్డి(35), సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేంద్ర రెడ్డిలుగా గుర్తించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu