హమ్మయ్య.. ఎట్టకేలకు చిరుత చిక్కింది!

గత మూడు నెలలుగా ఫారెస్టు అధికారులకు, ఎస్వీ వర్సిటీ భద్రతా సిబ్బందికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు బోనులో చిక్కింది.తిరుపతిలో గత మూడు నెలలుగా  ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ, వెటర్నరీ, ఆగ్రి కల్చర్ యూనివర్సిటీ, జూపార్కు రోడ్డు, అలిపిరి వద్ద చిరుత కుక్కలు, దుప్పులు, జింకలను వేటాడి ఆరగించి అక్కడే విడిచి పెడుతూ వస్తుంది. ఈ తరుణంలో జూపార్కు రోడ్డులో ఓ టూవీలర్ పై వెళ్తున్న వ్యక్తిపై కూడా దాడికి పాల్పడింది. అతడు తృటిలో తప్పించుకున్నాడనుకోండి అది వేరే విషయం. చిరుత దాడి దృశ్యం వెనుక వస్తున్న కారు కెమెరాలో రికార్డు అయ్యింది.  ఇది వైరల్ కావడంతో తిరుపతి వాసులు కూడా తీవ్ర భయాందోళనలతో నిద్రలేని రాత్రులు గడుపుతూ వస్తున్నారు.

చిరుతను బంధించేందుకు  ఫారెస్ట్ అధికారులు పలు చోట్ల బోన్లు ఏర్పాటు చేశారు. బోన్లు ఏర్పాటు చేసినపేపటీ నుంచి ఫలితం లేకుండా పోయింది. చిరుత ఆచూకీ చిక్కలేదు. జనం భయం తొలగలేదు. కాగా రెండు రోజుల క్రితం ఒక దుప్పిని నోటా కరచి ఎస్వీ వర్సిటీలోని ఓ ప్రధాన డిపార్ట్మెంట్ వద్ద ఆరగించి సగం దుప్పిని అక్కడే విడిచి వెళ్లిపోయింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అటు వైపు బోన్లు ఏర్పాటు చేశారు.

ఎట్టకేలకు చిరుత ఫారెస్ట్ అధికారులకు ఏర్పాటు చేసిన  ఆ బోనులో చిక్కింది. చిక్కిన చిరుతను తిరుపతి జూ పార్క్ కు తరలించారు. గతంలో వేదిక్ యూనివర్సిటీ పరిసరాల్లో పట్టుబడిన చిరుతను బంధించిన ఫారెస్టు అధికారులు నలమల అడవులకు తరలించారు. అయితే ఈ ప్రాంతంలో మరికొన్ని చిరుతలు కూడా సంచరిస్తున్నట్లు  అనుమా నిస్తున్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu