ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కు అస్వస్థత
posted on Aug 18, 2025 12:10PM

ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్ అధినేత నవీన్ పట్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇటీవలే ముంబైలో ఆపరేషన్ చేయించుకున్నారు.
నిన్న రాత్రి నవీన్ పట్నాయక్ అస్వస్థతకు గురి కావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆర్థరైటిస్ సమస్య కారణంగా వెన్నెముకకు ముంబైలో శస్త్ర చికిత్స చేయించుకుని గత నెల 12నే స్వరాష్ట్రానికి వచ్చారు. ముంబై నుంచి వచ్చిన నెల రోజులకే ఆయన మళ్లీ అనారోగ్యానికి గురి అయ్యారు. కాగా ఆస్పత్రి వర్గాలు ఇప్పటి వరకూ ఆయన హెల్త్ బులిటిన్ విడుదల చేయలేదు. బీజేడీ వర్గాల సమాచారం మేరకు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది.