తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

 

తిరుమల శ్రీవారి సేవలో నేడు ప్రముఖులు పాల్గోన్నారు. మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మనీంద్ర మోహన్ శ్రీవాస్తవ,  మంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ ఛీఫ్ సెక్రటరీ కె.విజయానంద్, కింగ్‌డమ్ మూవీ టీమ్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత నాగ వంశీ ఉదయం శ్రీవారిని దర్శంచుకున్నారు. రంగానాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

ఈ సందర్బంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక, టీటీడీ పవిత్రతను కాపాడేలా, పూర్వ వైభవం వచ్చిందని ప్రజలు చెబుతున్నారని అన్నారు.ఈ క్రమంలో దైవ దర్శనానికి వచ్చే లక్షలాది భక్తులకు, అన్నదానం తో పాటు ఇతర అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తరుణంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుని యువతకు లక్షలాది ఉద్యోగాలు రావాలని, అమరావతి పోలవరం ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి కావాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. 

శ్రీవారి ఆశీస్సులతో గతేడాది రాయలసీమలో రిజర్వాయర్లన్ని నిండి, ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని అన్నారు. హంద్రీనీవా ద్వారా 3850 క్యూసెక్కుల కృష్ణా జలాలను అడివిపల్లి రిజర్వాయర్ నింపి, హంద్రీనీవా కాలువ ద్వారా భవిష్యత్తులో తిరుపతికి తాగు పారిశ్రామిక అవసరాలకు నీటిని అందిస్తామని మంత్రి పేర్కొన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu