కొండాపూర్‌లో రేవ్‌ పార్టీ భగ్నం..11 మంది అరెస్ట్

 

హైదరాబాద్ కొండాపూర్‌లో రేవ్‌ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహుకులు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఏపీకి చెందిన వారేనని సమాచారం. 

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సంపన్న యువకులను పిలిపించి వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు వెల్లడించారు.  అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించగా.. 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్‌, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు.  వారి నుంచి 6 కార్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు అనే కొంతమంది గుట్టుచప్పుడు కాకుండా మారుపేర్లతో బ్యాంక్ అకౌంట్‌, మారు ఆధార్ కార్డులతో డబ్బున్న సరాబులను తీసుకువచ్చి రెండు రోజులపాటు ఎంజాయ్ చేయించి తీసుకు వెళ్తుంటారు. ఈ ముఠాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపై కూడా కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu