ఆయనకెందుకు ఇచ్చారు నాకెందుకివ్వరు .. ట్రంప్ వితండ వాదన
posted on Sep 24, 2019 4:59PM

ప్రపంచంలో శాంతి స్థాపన కోసం కృషి చేసే వారికి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారనేది అందరికి తెలిసిన విషయమే.. ఐతే తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను ప్రపంచ శాంతి కోసం చేసిన కృషికి ఇప్పటికే ఆ బహుమతి వచ్చి ఉండాల్సిందని కానీ నోబెల్ కమిటీ తనకు అన్యాయం చేసిందని వాపోయారు. ఐతే 2009 లో ఒబామా అధ్యక్ష పదవి చేపట్టిన కొద్ది రోజులకే నోబెల్ బహుమతి ఇచ్చారని ఐతే ఎందుకు ఇచ్చారో ఒబామాకు కూడా తెలియదని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరి కొన్ని రోజులలోనే అమెరికాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మాక్సిమం మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్ కన్ను ఇపుడు నోబెల్ పై పడినట్లుంది. అయినా అదేమైనా అడిగి మరి ఇప్పించుకునే గిఫ్టా.. ? ప్రపంచ వ్యాప్తంగా శాంతి కోసం కృషి చేసే మహానుభావుల కోసం ఇచ్చే బహుమతికి అసలు అయన అర్హుడేనా..