మనిషి పుట్టుక కోసమే ఈ సృష్టి
posted on Oct 25, 2024 4:04PM
సలీం పెయింటింగ్స్ వేసి కుటుంబాన్ని పోషించుకునే వాడు. సలీం భార్యకు ఇది నచ్చేది కాదు. తన భర్త పెద్ద వ్యాపారిగా స్థిర పడలేదని భార్య ఆవేదన చెందేది. సలీంతో ప్రతీరోజు గొడవపడేది. మేరా బద్ కిస్మతీ( నా దురదృష్టం) అని గొడవపడేది. సలీం అన్నదమ్ములు బాగా సెటిలయ్యారు. పెద్ద పెద్ద భవంతులు కట్టుకున్నారు. సలీం పరిస్థితి దిగ జారిపోవడంతో చుట్టాల్లో చులకనభావం అయ్యాడు . చివరకు ఫంక్షన్స్ కు కూడా ఆహ్వానం అందడం లేదు. మనస్థాపానికి గురైన సలీం మౌలానా దగ్గరికి వచ్చాడు.
సలీం: సలాం వాలేకుం మౌలానా సాబ్
మౌలానా: వాలేకుం సలాం సలీం భాయ్ , కైరియత్
సలీం: అల్ హమ్ దు లిల్లా మౌలానా సాబ్... జీ మౌలానా సాబ్ మేరా పైదాయిష్ ఏత్తే ఫాక్ సే ( నా పుట్టుక అనుకోకుండా జరిగింది) అంటూ నిట్టూర్చాడు.
మౌలానా: డార్విన్ సిద్దాంతం ప్రకారం భూమిపై 2000 మిలియన్ సంవత్సరాల క్రితం జీవాల పుట్టుక జరిగింది. ఇది సైన్స్ ప్రకారం చూస్తే బయటపడిన నిజం.
తొలుత ఏకకణ జీవులు, ఆ తర్వాత బహుళ సెల్యులార్ జీవులు క్రియాశీలకంగా మారాయి.
దవడలేని చేపలు పరిణామం చెందాయి. తరువాత, ఉభయచరాలు, సరీసృపాలు మరియు కొన్ని క్షీరదాలు ఉనికిలోకి వచ్చాయి.
ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు. వారి శారీరక లక్షణాలు, ప్రవర్తన మొదలైన వాటిలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి.
కొన్ని లక్షణాలు వారి తల్లిదండ్రుల నుండి సంతానానికి వారసత్వంగా సంక్రమిస్తాయి.
అన్ని జీవ జాతులలో పునరుత్పత్తి రేటు మారుతూ ఉంటుంది. కొన్ని ఎక్కువ కొన్ని కనిష్టంగా పునరుత్పత్తి చేస్తాయి.
లక్షణాలు లేదా వ్యక్తిత్వాలు తరచుగా తల్లిదండ్రుల నుండి సంతానానికి సంక్రమిస్తాయి. ఈ ప్రపంచాన్ని సృష్టించిన అల్లాకి తెలియకుండా ఏదీ జరగదు .. అన్నీ ఆయన కనుసన్నల్లో జరిగినవే. ఎవరికి సంపద ఇవ్వాలో ఎవరి సంపద ఇవ్వకూడదో అన్నీఆయనకు తెలుసు. మనిషి పుట్టుక కోసమే ఈ ప్రపంచం ఆవిష్కృతం అయ్యింది. 50 , 60 ఏళ్ల జీవితానికే మనిషి కలలు కంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు.కొన్ని వేల మిలియన్ సంవత్సరాల క్రితమే సృష్టి జరిగింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఈ సృష్టి అలానే ఉంటుంది. మనిషి కేరక్టర్ అతి చిన్నది. మంచి పనులు చేయడానికే మనిషి జన్మనెత్తాం. ఆ పనులు చేసి వెళ్లిపోవాలి. మనిషికి ఆక్సిజన్ అత్యంత ఆవిశ్యం. . ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే దేవుడు సహజసిద్దమైన ఆక్సిజన్ తయారు చేస్తున్నాడు ప్రకృ తి ద్వారా అది మనకందుతుంది. త్రాగడానికి నీళ్లు అవసరం కాబట్టి మేఘాలు గర్జించగానే వర్షం పడుతుంది. భూమిలో ఫిల్టర్ అయ్యే ఏర్పాట్లను కూడా అల్లా చేశాడు. గాలి, నీళ్ల తర్వాత రొట్టె ముఖ్యమైన ఆహారం. అది కూడా మనకు భూమి ద్వారా ఇవి పొందుతూనే ఉన్నాం. దేవుడు ఈ సెటప్ చేసేశాడు. ఇస్లాం పుట్టుక నుంచే సైన్స్ ఉంది. శాస్త్రవేత్తలను ఇస్లాం అందించింది. బ్రిటీషు వారు వచ్చాక ఇస్లాం సైంటిస్ట్ లు మరుగన పడ్డారు. ఈ విషయం ఖురాన్, హదీస్ లో కూడా ఉంది. అల్లా సంకల్పం తో మనిషి పుట్టుక జరిగింది.
ఎంటర్ టైన్ మెంట్ కోసమే మనిషి పుట్టుక ఉండ కూడదు. కోరికలు ఉండకూడదు.లక్ష్యాలు మాత్రం ఉండాలి. ఏదీ ఆశపడకూడదు. అల్లా సంకల్పిస్తే ఇస్తాడు. సంకల్పించకుంటే ఇవ్వడు. ఎంటర్ టైన్ మెంట్ కోరుకునే వారే తల్లిదండ్రులను వృద్దాశ్రమాలలో దించేస్తున్నారు. ఎంటర్ టైన్ మెంట్ కోసమే బ్రిటీష్ వాళ్లు మత్తు పదార్థాలను పరిచయం చేశారు. మంచి పనులు చేయడానికే ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అంటూ మౌలానా తన తక్రీర్( ప్రవచనం) ముగించాడు.
బదనపల్లి శ్రీనివాసాచారి