సెల్యూట్ సీపీ సాధిక్ సార్..
posted on Oct 15, 2014 11:54AM
.jpg)
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పదేళ్ళ బాలుడు సాధిక్‌కి ఒక కోరిక వుండేది. అది.. హైదరాబాద్ నగరానికి పోలీస్ కమిషనర్ కావాలని. మేక్ ఎ విష్ ఫౌండేషన్ ద్వారా ఆ బాలుడి కోరికను తెలుసుకున్న హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఆ బాలుడి కోరికను నెరవేర్చారు. బుధవారం ఉదయం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌గా సాధిక్ పదవీ బాధ్యతలు స్వీకరించాడు. ఆ సమయంలో ఆ బాలుడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడి కోరిక నెరవేర్చినందుకు పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డికి సాధిక్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. సరిదిద్దలేని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల కోరికలను తెలుసుకుంటూ వాటిని నెరవేర్చేందుకు తమవంతు కృషి చేస్తున్నట్టు మేక్ ఎ విష్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. సాధిక్ బుధవారం నాడు ఒక్కరోజు సీపీగా వుంటాడు.