కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యం: చంద్రబాబు
posted on May 29, 2016 5:35PM
.jpg)
కుటుంబం కన్నా తనకు పార్టీయే ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతిలో జరుగుతున్న 35వ మహానాడు సందర్భంగా ఆయన ముగింపు సందేశం ఇస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడులో అందరూ అద్భుతంగా భాగస్వాములయ్యారని అభినందించారు. టీడీపీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలు, నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల వల్ల తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా 851 మంది రక్తదానంలో భాగస్వాములయ్యారని, స్మార్ట్ విలేజ్‌లో 300 మంది కార్యకర్తలు భాగస్వాములమవుతామని తెలపారని చెప్పారు. 3 రోజుల్లో మొత్తంగా 380 మంది భారీగా విరాళాలు అందజేశారని, మొత్తం 11 కోట్ల 55 లక్షల 8వేల 59 రూపాయలు విరాళాలుగా అందాయని బాబు ప్రకటించారు.