వెంకయ్య ప్లేస్ మారింది.. కర్ణాటక నుంచి కాదు...!
posted on May 29, 2016 5:47PM
.jpg)
కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయనను తిరిగి ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుతారా.? అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఏపీ నుంచి పంపుతారని..కాదు కాదు కర్ణాటక నుంచే మళ్లీ ఆయన రాజ్యసభకు వెళతారు అంటూ ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి తెరదించింది బీజేపీ అధినాయకత్వం. రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. దీనిలో రాజస్థాన్ నుంచి వెంకయ్యనాయుడు, ఓం ప్రకాశ్ మాథుర్, హర్షవర్థన్ సింగ్, రాంకుమార్ వర్మ, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయెల్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాం విచార్ నేతంలను రాజ్యసభకు ఖరారు చేసింది.