క్రికెట్ లవర్స్‌కు షాక్..ఐపీఎల్ ఫైనల్‌కు వానగండం..!
posted on May 29, 2016 4:26PM
.jpg)
క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుది సమరానికి రెడీ అయ్యింది. లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయం ఏ జట్టును వరిస్తుందా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. గార్డెన్‌సిటీ గత రెండు రోజులుగా వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. దీనిని బట్టి మ్యాచ్ జరగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యంకాకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం రేపు రిజర్వ్ డే ఉంది.