మళ్లీ ఫ్యాన్సీ నెంబర్ల గోల మొదలైంది బాబోయ్

 

 

తెలంగాణ రవాణా శాఖ ధనవంతులకు షాక్ ఇచ్చింది..  వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లు కొనుగోలు చేసే బడా బాబులకు రవాణా శాఖ జలక్ ఇచ్చిందని చెప్పవచ్చు.. ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి నానాటికి పెరిగిపోతుండడంతో దానిని ఎన్కాష్ చేసుకోవాలని రవాణా శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది.. ఇందులో భాగంగానే రవాణా శాఖకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఫ్యాన్సీ నెంబర్ల రేట్లను ఒక్కసారిగా డబుల్ చేసింది..  దాదాపు 100 నుంచి 200 శాతం రేట్లు పెంచుతూ ఆదేశాలిచ్చింది.. ఇప్పటికే ఒకటి నుంచి తొమ్మిది లోపు ఉన్న సింగిల్ డిజిట్ నెంబర్ల కోసం లక్షల రూపాయ లను బడాబాబులు ఖర్చు చేస్తున్నారు.

వేలంపాటలో లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తు న్నారు. ఏకంగా *ఒక్క ఫాన్సీ నెంబర్ కోసం 15 నుంచి 20 లక్షల రూపాయ లను ఫాన్సీ నెంబర్ ల కోసం ఖర్చుపెట్టిన బడా బాబులు కూడా ఉన్నారు.. ఇప్పటివరకు టెండర్ కోసం వేసే ఫేసు చాలా తక్కువగా ఉంది దానిని గుర్తించిన రవాణా శాఖ టెండర్రింగ్ ఫీస్ ని భారీ మొత్తంలో పెంచాలని నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగానే 50 వేలకు ఉన్న ఫీజు ను ఒక్కసారిగా 1,50,000కు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది.. మొత్తం ఆరు స్లాట్ గా ఉన్న టెండర్ ప్రక్రియకు సంబంధించిన రేట్లను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది.  వీటిని అమలులోకి తెస్తామని పేర్కొంది. 

రవాణా శాఖ లో ఫాన్సీ నంబర్స్ ఫీజులు భారీ గా పెంపు.

50 వేల ఫీజు ను 1, 50, 000 కి పెంపు. 

30 వేల ఫీజు ను 1, 00, 000 కి పెంపు.

20 వేల ఫీజు ను 50, 000 కి పెంపు.

20 వేల ఫీజు ను 40, 000 కి పెంపు.

10 వేల ఫీజు ను 30,000 కి పెంపు.

5వేల ఫీజు ను 6000 కి పెంపు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu