తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకి సుప్రీం ఆదేశం

తొలగించిన ఓట్ల వివరాలను బహిర్గతం చేయాల్సిందే.. ఈసీఐకు సుప్రీం ఆదేశించింది. బీహార్ లో ఎస్ఐఆర్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను  సుప్రీం కోర్టు గురువారం (ఆగస్టు 14) విచారించింది. ఈ సందర్భంగా  బీహార్ లో ఇటీవల  నిర్వహించిన ఎస్ఐఆర్ (ఓటర్ల జాబితా ప్రత్యేక  సవరణ)లో భాగంగా  తొలగించిన 65 లక్షల ఓట్ల వివరాలను బహిర్గతం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

అదీ ఈ నెల 19లోగా ఆ వివరాలను వెల్లడించాలని గడువు విధించింది. అదే విధంగా తమ ఆదేశాలపై తీసుకున్న చర్యలపై ఈనెల 22లోగా  తమకు నివేదిక సమర్పించాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.    

Online Jyotish
Tone Academy
KidsOne Telugu