తెలంగాణలో బుధవారం నుంచి లాక్ డౌన్

తెలంగాణలో సంపూర్ణ లాక్ డౌన్ విధించారు. మే 12 బుధవారం ఉదయం 10 గంటలనుంచి పదిరోజుల పాటు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటలనుండి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశం వుంటుందని క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. 

హైకోర్టులో విచారణ జరుగుతూ మధ్యాహ్నం 2.30 గంటల వరకు ప్రభుత్వ నిర్ణయాన్ని తెలియజేయాలని డెడ్‌లైన్ విధించినందున మంత్రివర్గం అత్యవసర నిర్ణయం తీసుకుంది. టీకాలకు కొరత ఏర్పడిన దృష్ట్యా విదేశాల నుంచి కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇప్పటికే ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లకు వెళ్ళనున్నట్లు ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu