గంగా నదిలో కరోనా శవాలు.. 

కరోనా మరణాలకు స్మశానవాటికలు నిండుతున్నాయి. కొన్ని చోట్ల ఆ స్మశానాలు దొరకకపోవడంతో   కరోనా వల్ల చనిపోయిన వారి శవాలు చివరికి నదిలో కూడా ప్రత్యేక్షం అవుతున్నాయి. భారత దేశ ప్రజలు పవిత్రమైన నది గా భావించే గంగా నదిలో కొన్నీ కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలను గుర్తించారు.  ఆ శవాలు కరోనా శవాలుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. కరోనా మృతులను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

మరోవైపు యమునా నదిలో కూడా భయానక దృశ్యాలు కనిపించాయి. పదికి పైగానే కరోనా మృతదేహాలు నదీ తీరంలో తేలుతూ కనిపించాయి. ఉత్తర ప్రదేశ్‌లోని హామిర్‌పుర్‌ జిల్లాలో కనిపించిన ఈ దృశ్యాలు స్థానికుల్లో భయాందోళన సృష్టించాయి. హామిర్‌పుర్‌, కాన్పూర్‌ జిల్లాల్లోని గ్రామాల్లో మృతుల సంఖ్య పెరిగిపోతుండటం, శ్మశానవాటికలు నిండిపోతుండటంతో మృతదేహాలను నదిలో వదిలేస్తున్నారని కొందరు పేర్కొంటున్నారు. గుర్తుతెలియని కొన్ని మృతదేహాలను అధికారులు నదిలో వదిలేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.  

కాగా ఈ విషయంపై హామిర్‌పుర్‌ ఏఎస్పీ అనూప్‌కుమార్‌ను ప్రశ్నించగా ఆయన పలు విషయాలు వెల్లడించారు. హామిర్‌పుర్‌, కాన్పుర్‌ జిల్లాల్లోని కొన్ని తెగల్లో మృతదేహాలను కాల్చడం, పూడ్చడం చేయరని.. నదిలో వదిలేస్తారని పేర్కొన్నారు. యమునా నదిలో అప్పుడప్పుడు తేలుతున్న మృతదేహాలు కనిపిస్తాయన్నారు. అయితే అంత్యక్రియలు నిర్వహించేవారు కూడా కొవిడ్‌ భయంతో నదిలో వదిలేస్తున్నారని.. దీంతో యమునలో కనిపించే మృతదేహాల సంఖ్య అధికంగా ఉంటోందని వెల్లడించారు. అంత్యక్రియలు నిర్వహించాలనుకున్నా.. ఇతరుల నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో దిక్కు తోచని స్థితో మరికొందరు నదిలో వదిలేస్తున్నారని తెలిపారు. బిహార్‌లోని బక్సర్‌ జిల్లాలో మృతదేహాల కలకలం రేగింది.  

చైన్నైలో చిన్నారి కళ్ల ముందే  తండ్రి హత్య.. 

ఓ చిన్నారి కళ్ల ముందే ఆమె తండ్రిని కొంత మంది దుండగులు అతి దారుణంగా నరికి చంపిన ఘటన తమిళనాడులోని తిరుచిలో జరిగింది. గోపి కన్నన్ అనే న్యాయవాది తన కుమార్తెతో కలిసి తిరుచిలోని భీమ్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆదివారం రోడ్డుపై తన కుమార్తెకు సైకిల్ తొక్కడం నేర్పిస్తుండగా.. హఠాత్తుగా వెనక నుంచి వచ్చిన  కొంతమంది గుర్తు తెలియని దుండగులు ఆయన చుట్టూ చేరి దాడి చేశారు. వేట కొడవళ్లతో విరుచుకుపడి అత్యంత పాశవికంగా హత్య చేశారు. దాడి దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు.  


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu