పొన్నాలకు అస్సలు సిగ్గులేదు: పాల్వాయి
posted on Sep 26, 2014 6:05PM
.jpg)
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సిగ్గులేదని, అందుకే మెదక్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఓడిపోయినా పదవిని పట్టుకుని వేలాడుతున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. పొన్నాల లాంటి అసమర్థుడికి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలను అప్పగిస్తే పార్టీ ఎలా మనగలుగుతుందని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు యువతరానికి అప్పగించాలని ఆయన అన్నారు. పొన్నాల అసమర్థత వల్లే ఇంకా పార్టీ సభ్యత్వ నమోదు ఇంకా ప్రారంభం కాలేదని, ఒకపక్క కాంగ్రెస్ పార్టీ నుంచి భారీగా వలసలు జరుగుతూ వుంటే, మరోవైపు పార్టీలో వున్నవారిని సస్సెండ్ చేస్తున్నారని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పొన్నాల పదవి ఊడిపోయే అవకాశం వుందని పాల్వాయి జోస్యం చెప్పారు.