Latest News

సచిన్ ను అధిగమించేసిన కోహ్లీ!

posted on: Jan 19, 2026 11:32AM

టీమిండియా స్టార్ క్రికెటర్, కింగ్  కోహ్లీ  ఖాతాలో మరో అరుదైన  ప్రపంచ రికార్డు చేరింది. న్యూజిలాండ్‌తో ఇండోర్ వేదికగా ఆదివారం (జనవరి 18)  రాత్రి జరిగిన మూడో వన్డేలో  కోహ్లీ అద్భుత శతకంతో చెలరేగాడు. ఈ శతకంతో కోహ్లీ న్యూజిలాండ్ పై 7వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. ప్రపంచంలో మరే క్రికెటర్ ఇంత వరకూ కివీస్ పై వన్డేల్లో ఏడు సెంచరీలు చేయలేదు. ఈ మ్యాచ్ లో టీమ్ ఇండియా పరాజయం పాలైనప్పటికీ  కోహ్లీ  అరుదైన రికార్డు సాధించాడు. కివీస్‌పై అత్యధిక వన్డే శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఇప్పటివరకు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్, భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్  పేరిట ఉన్న 6 సెంచరీల రికార్డును కోహ్లీ అధిగమించాడు.   అంతే కాదు.. కోహ్లీ సచిన్ పేరిట ఉన్న రికార్డును కూడా తిరగరాశాడు. అదెలా అంటే.. అన్ని ఫార్మాట్ లలోనూ కలిపి కోహ్లీ కివీస్ పై 10 శతకాలు బాదాడు.  ఇప్పటి వరకూ కివీస్ పై 9 సెంచరీలతో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ తో పాటు జాక్వెస్ కలిస్, జో రూట్ పేరు మీద ఉంది. ఇప్పుడా రికార్డును కోహ్లీ అధిగమించాడు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...