బినామీల కోసమే విశాఖ భూముల అమ్మకం :యనమల
posted on Feb 19, 2021 10:55AM
విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకం కుట్ర జగన్, విజయసాయిరెడ్డిలదే అన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల. రాజధాని పేరుతో విశాఖలోని ప్రైవేటు స్థలాలు, ఆశ్రమ భూములపై జగన్ కన్ను వేశారని ఆరోపించారు. అవి చాలక ఇప్పుడు ఏకంగా స్టీల్ ప్లాంట్ భూములపైనే జగన్ నజర్ పడిందని మండిపడ్డారు. బినామీల పరం చేసేందుకే స్టీల్ ప్లాంట్ భూముల అమ్మకమని... అందులో మొదటి స్టెప్ ప్రధానికి జగన్ లేఖ రాయడమని యనమల ఆరోపించారు. భూముల అమ్మకం ప్రణాళిక.. జగన్ లేఖలో రహస్య అజెండా ఉందని అన్నారు. విశాఖలో జె గ్యాంగ్ బెదిరింపులు, భూకబ్జాలకు అంతే లేదని యనమల ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దిగమింగే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. 2లక్షల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేయడం కోసం కుట్ర చేస్తోందన్నారు. పరిరక్షణ ఉద్యమం వేదికలపైనుంచి వైసీపీ నాయకులను, విజయసాయిరెడ్డి లాంటి పందికొక్కుల్ని ప్రజలు తరమికొట్టాలని పిలుపు ఇచ్చారు. సీఎం జగన్ ఆడుతున్న డ్రామను రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకుని గట్టిగా నిలదీయాలని పట్టాభి సూచించారు. ఏడాది క్రితమే పోస్కోతో జగన్‌కు ఒప్పందం కుదిరిందని పట్టాభిరామ్ ఆరోపించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల కోసం సీఎం జగన్ నాటకం ఆడుతున్నారని.. విశాఖ ఉక్కు మన హక్కని.. వదులుకునేది లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు. సీఎం జగన్ డ్రామాలను ఆధారాలతో సహా బయటపెడుతున్నామన్నారు. ప్రభుత్వాన్ని నడుపుతున్నారా?.. లేక రియల్ ఎస్టేట్ కంపెనీని నడుపుతున్నారా? అని పట్టాభి ఫైర్ అయ్యారు.