పాడె మోసిన రాహుల్ గాంధీ..
posted on Feb 19, 2021 11:28AM
కేంద్ర మాజీ మంత్రి సతీశ్ శర్మ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం గోవాలో కన్నుమూసిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన అంత్యక్రియలను ఢిల్లీలో జరిగాయి. ఈ నేపథ్యంలో ఆయన పాడెను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు మోశారు. గతంలో కెప్టెన్ సతీశ్ శర్మ గాంధీ కుటుంబానికి విధేయుడిగా ఉన్నాడు. సతీశ్ శర్మ సికింద్రాబాద్‌లో 1947, అక్టోబరు 11న జన్మించారు. సతీశ్ శర్మకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మొదట ప్రొఫెషనల్ కమర్షియల్ పైలెట్ గా పని చేసిన ఆయన అనంతరం రాజకీయాల్లోకి వచ్చారు. మూడు సార్లు లోక్‌సభ సభ్యుడిగా, మూడు సార్లు రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు.