టీడీపీ సభ్యుల సస్పెన్షన్ సరికాదు...
posted on Mar 14, 2015 3:36PM

జాతీయగీతాన్ని అవమానించారన్న ఆరోపణలతో తెలంగాణ అసెంబ్లీ నుంచి తెదేపా ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని ఉద్దేశించి కాంగ్రెస్ శాసనసభాపక్షనేత జానారెడ్డి మాట్లాడుతూ తెదేపా ఎమ్మెల్యేలను సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. జాతీయగీతం వివాదంపై ప్రభుత్వం పూర్తి వీడియోను చూడలేదని, సీడీని సెన్నార్ చేసినట్లు ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. మొత్తం ఫుటేజీని మరోసారి చూస్తే అసలు పోడియంలోకి మొదట ఎవరువచ్చారన్నది తెలుస్తుందని అయన తెలిపారు. ఫుటేజీచూపించకపోతే ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్లే అవుతుందని అన్నారు. సభాపతికి ఎవరి సీటు ఎక్కడ అనే విషయంపై లేఖ రాశానని తెలిపారు. పీసీసీ, సీఎల్పీ మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని జానారెడ్డి స్పష్టం చేశారు.