టీఆర్ఎస్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు... ఎర్రబెల్లి
posted on Mar 14, 2015 3:43PM

శాసనసభలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారనే ఉద్దేశంతోనే సభ నుంచి తెలుగుదేశం పార్టీ సభ్యులను సస్పెండ్ చేశారని తెలంగాణ టీడీఎల్పీ నాయకుడు ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. ‘‘సీఎం కేసీఆర్ ఒంటెద్దు పోకడలతో రాష్ట్రంలో నిజాం పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనేది కేసీఆర్ ఉద్దేశం. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఈ అంశం మీద సోమవారం నాడు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రపతికి, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చట్టవిరుద్ధంగా టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్‌లో మంత్రిగా కొనసాగుతూ వుండటం చట్టవిరుద్ధం. ఆయన మీద చర్యలు తీసుకోవాలని గవర్నర్, స్పీకర్‌లకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడం దారుణం’’ అని ఆయన అన్నారు.