కోటప్పకొండ మర్డర్ మిస్టరీ వీడింది...

 

గుంటూరు జిల్లా కోటప్పకొండ దేవాలయం వద్ద ఫిబ్రవరిలో ప్రేమజంట మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో ఆ జంటలోని యువతి మరణించింది. యువకుడు గాయపడ్డాడు. దాడి చేసిన వ్యక్తి వారి వద్ద వున్న సెల్ ఫోన్, కొంత డబ్బు తీసుకుని పారిపోయాడు. ఈ కేసుకు సంబంధించిన మిస్టరీ ఇప్పుడు వీడింది. ప్రకాశం జిల్లాకు చెందిన బానోతు స్వాతి, నాయక్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ కలసి దైవ దర్శనం కోసం కోటప్పకొండకు వచ్చారు. వీరి మీద దాడి జరిగింది. అయితే మృతురాలి తల్లిదండ్రులు ఇది నాయక్ కుటుంబ సభ్యులు చేసిన దాడి అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు ఈ ఘటన వెనుక నాయక్ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చారు. ఈ దాడికి పాల్పడిన బాజి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నిందితుడు గతంలో కూడా కొంతమంది యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఒక కేసుకు సంబంధించి పోలీసులు అరెస్టు చేయగా బెయిల్ మీద విడుదలయ్యాడు. ఇప్పుడు కోటప్పకొండలో ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu