ఎక్మోపై తారకరత్న.. కండీషన్ క్రిటికల్?

కుప్పంలో నిన్న తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నకు వైద్యులు ప్రస్తుతం ఎక్మో అమర్చి  చికిత్స అందిస్తున్నారు.కుప్పంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.  

 లోకేష్ కు మద్దతుగా ఈ యాత్రలో పాల్గొన్న సినీనటుడు నందమూరి తారకరత్న నిన్న సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను   వెంటనే తారకరత్నను ఆస్పత్రికి తరలించారు. అక్కడ గుండెపోటు అని వైద్యులు తేల్చారు. వెంటనే ఆయనను కుప్పం మెడికల్ కాలేజీకి తరలించి ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.  

టీడీపీ నేత, హీరో బాలయ్య ఆస్పత్రికి చేరుకొని అన్నీ దగ్గరుండి పర్యవేక్షించారు. అక్కడి నుంచి  మెరుగైన చికిత్స కోసం తారకరత్నను బెంగళూరుకు రోడ్డు మార్గంలో అంబులెన్స్ లో తరలించారు.  నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలలో వైద్యులు క్రిటికల్ ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. వైద్యులు ఆయనకు ఎక్మో అమర్చారు. తారకరత్న రక్తనాళాళ్లో 95 శాతం బ్లాక్స్ ఉన్నాయని చెబుతున్నారు.