యువగళం డే నంబర్ 2 ప్రారంభం
posted on Jan 28, 2023 10:45AM
కుప్పం పీఈఎస్ మెడికల్ కళాశాల సమీపంలో క్యాంప్ నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర రెండో రోజు ప్రారంభమయింది. ఈ రోజు ఆయన 9.7 కిలోమీటర్లు నడవనున్నారు. బెగ్గిలపల్లిలో స్థానికులతో మాటా మంతీలో పాల్గొంన్నారు.
కలమలదొడ్డిలో భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమవుతారు. కలమలదొడ్డి నుంచి పాదయాత్ర కొనసాగించి శాంతిపురం క్యాంప్ కు చేరుకుంటారు. అక్కడ ప్రముఖలతో భేటీ అవుతారు. శనివారం ఆయన శాంతిపురంలో బసచేస్తారు.
.webp)
ప్రముఖులతో సమావేశమవుతారు. కుప్పంలోని శాంతిపురంలో రాత్రి బస చేయనున్నారు. తొలి రోజులాగే రెండో రోజు కూడా లోకేష్ పాదయాత్రలో అడుగు కలిపేందుకు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులూ తరలి వచ్చారు. వారికి అభిమాదం చేస్తూ లోకేష్ ముందుకు కదిలారు.