28 మందితో అమ్మ జంబో కేబినెట్..

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత. మొత్తం 134 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న ఆమె 28 మందితో జంబో కేబినెట్‌‌ను సృష్టించారు. వీరిలో 13 మంది కొత్త వారున్నారు. అన్నాడీఎంకే తరపున 16 మంది మహిళలు అసెంబ్లీకి ఎన్నికవ్వగా, ముగ్గురు మహిళలను ఆమె మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మరి కాసేపట్లో మద్రాస్ సెంట్రల్ యూనివర్శిటి ప్రాంగణంలో జయలలితతో పాటు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.