యంగ్ ప్రొఫెషనల్స్ నియామకానికి.. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
posted on Jun 17, 2025 7:45PM

స్వర్ణాంధ్ర విజన్–2047 పక్కగా అమలు చేసేందుకు కుటమి ప్రభుత్వం చర్యలు చేపటడుతోంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు యాక్షన్ ప్లాన్ అమలుకు ప్రత్యేకంగా నిపుణులను నియమించాలని నిర్ణయించింది. రెండేళ్ల కాలనికి సంబంధించి నియోజకర్గానికి ఒకరు చొప్పున 175 నియోజకర్గాల్లో యంగ్ ప్రొఫెషనల్స్‌ని నియమించేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ యంగ్ ప్రొఫెషనల్స్ నియామకాలు ఏడాది కాలానికి ఒప్పంద పద్ధతిలో జరుగుతాయి. అభ్యర్థుల పనితీరు, అవసరాల ఆధారంగా ఈ కాంట్రాక్టు కాలాన్ని భవిష్యత్తులో పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకరు చొప్పున ఈ యంగ్ ప్రొఫెషనల్స్ పనిచేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు 60,000 వరకు జీతం చెల్లిస్తారు. వయోపరిమితి విషయానికొస్తే, 2025 మే 1వ తేదీ నాటికి అభ్యర్థి వయసు 40 ఏళ్లు మించకూడదని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను స్వీకరిస్తారు. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా విద్యార్హతలు, రాత పరీక్ష, ఇంటర్వ్యూలను ప్రామాణికంగా తీసుకుంటారని ప్రభుత్వం తెలిపింది. ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, ఎంపిక విధానం, వేతనం తదితర పూర్తి వివరాల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://apsdpscareers.com/YP.aspx వెబ్ పోర్టల్‌ను సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు