జగ్గన్నతోట ప్రభల తీర్ధానికి రాష్ట్రపండుగ హోదా

కోనసీమలో ఏటా కనుమ పండుగ రోజున జరనిగే జగన్నతోట ప్రభల తీర్ధానికి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తింపును ఇచ్చింది. కొనసీమ సంస్కృతికి చిహ్నంగా నిలిచే ఈ ప్రభల తీర్ధం ఇక నుంచి అధికారికంగా రాష్ట్రపండుగగా జరగనుంది. ఈ ప్రభల తీర్ధానికి దాదాపు నాలుగు వందల ఏళ్ల చరిత్ర ఉంది.  ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పిస్తూ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల కిందట జరిగిన కేబినెట్ భేటీ నిర్ణయం తీసుకుంది.

ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.  జగన్నతోట ప్రభల తీర్థానికి  రాష్ట్ర పండుగ హోదా కల్పించడం తెలుగువారి ఆచారాలకు, ఆధ్యాత్మిక వారసత్వానికి దక్కిన అత్యున్నత  గౌరవంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కోనసీమ ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ గుర్తింపు   దోహదపడుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  

సంక్రాంతి సంబరాల్లో భాగంగా కనుమ రోజున   జగన్నతోట ప్రభల తీర్థం జరుగుతుంది.   అమలాపురం పరిసర గ్రామాల నుంచి  ఏకాదశ రుద్రులు ప్రభల రూపంలో ఒకేచోట కొలువుదీరడం ఈ జగ్నన్నతోట ప్రభత తీర్థం ప్రత్యేకత.  ఎత్తైన ప్రభలను భుజాలపై మోస్తూ కౌశికా నదిని దాటించే దృశ్యం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతుంది. ముఖ్యంగా గంగలకుర్రు ప్రభ కౌశికను దాటి వచ్చే దృశ్యం ఒళ్లుగొగుర్పొడిచేలా ఉంటుంది.

ఈ ప్రభల తీర్థానికి  ఏటా సుమారు ఆరు లక్షల మందికి పైగా తరలివస్తారు.  ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రభల తీర్థ విశిష్ఠతను గతంలో కొనియాడారు. అదలా ఉంచితే ప్రభల తీర్థానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగ హోదా  కల్పించడంతో ఈ ఉత్సవాల నిర్వహణకు   ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుంది. మెరుగైన మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లతో ఈ ఏడాది ప్రభల తీర్థం మరింత వైభవంగా నిర్వహిస్తామని  మంత్రి కందుల రమేష్ తెలిపారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu