వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్

ఆంధ్రప్రదేశ్ సర్కార్ వంశీకి మరో షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఆయనను పది రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మేరకు ఆయనను పోలీసులు మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ మూడు రోజుల పాటూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసులు వంశీని విచారిస్తారు. అనంతరం వంశీని మళ్లీ జిల్లా జైలుకు తరలిస్తారు. ఇక జైల్లో సౌకర్యాలపై వంశీ చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు ఆయనకు జైలులో బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే వెస్ట్రన్ టాయిటెల్ సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించింది.

అయితే పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ సదుపాయాల కల్పన వంశీకి పెద్ద ఊరట అని భావించలేము. గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ అక్రమాలపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, భూముల కబ్జా, తక్కువ ధర చెల్లించి సొంతదారులను బెదరించి భూములు సొంతం చేసుకున్నారన్న ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైనా కూడా సిట్ దర్యాప్తు చేయనుంది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu