కాలు తొక్కినందుకు- పొడిచి పారేశారు!

 

ఈ నెల 14వ తేదీన దేశవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. కానీ అదే వేడుకలలో చోటుచేసుకున్న ఓ అపశృతి వల్ల  వెంకటేశ్ అనే కుర్రవాడి జీవితాన్ని అంతం చేసింది. బెంగళూరు దగ్గరలోని అడగోడి అనే ప్రాంతంలో జరుగుతున్న రథసప్తమి వేడుకలలో వెంకటేశ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా స్థానిక దేవాలయంలో జరుగుతున్న ఉత్సవంలో నలుగురితో పాటు కలిసి ఆటాపాటా మొదలుపెట్టాడు.

 

ఆ సమయంలో ఎవరి కాలో తొక్కడంతో చిన్నపాటి గొడవ మొదలైంది. గొడవ కాస్తా చిలికిచిలికి అతని ప్రాణాల మీదకు తెచ్చింది. ఆరుగురు యువకులు కలిసి వెంకటేశ్‌ను దారుణంగా పొడిచిపొడిచి చంపేశారు. ప్రస్తుతం ఆ ఆరుగురు నిందితులనూ పోలీసులు అరెస్టు చేయడంతో వార్త దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎవరో ఒకరు సర్దుకుపోవలసిన చోట గొడవ జరిగితే... చివరికి అదెంతటి పరిమాణాలకైనా దారి తీస్తుందని మరోసారి తెలిసివచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu