జాట్‌ ఉద్యమం- హర్యానాలో హల్‌చల్‌!

 

తమకు ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించాలంటూ హర్యానాలో జాట్ వర్గం వారు సాగిస్తున్న ఉద్యమం కొనసాగుతూనే ఉంది. రాహ్‌తక్‌, జజ్జర్‌ జిల్లాలలో ఆందోళనలు ఉధృతంగా సాగడంతో రైళ్లతో సహా రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఆ రెండు జిల్లాల మధ్యా ఉన్న రాష్ట్ర, జాతీయ రహదారులు సైతం మూసుకుపోయాయి. ఉద్యమం ఒకోసారి హింసాత్మకంగా సాగుతూ ఉండటంతో ఆ రెండు జిల్లాలలో ఉన్న మొబైల్‌ ఫోన్లకి ఇంటర్నెట్‌ సేవలని నిలిపివేశారు. ఎస్‌.ఎం.ఎస్‌ సేవలు సైతం నిలిచిపోయాయి. ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని నిలువరించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

 

జాట్‌ వర్గం ఆందోళనను శాంతింపచేసేందుకు ప్రభుత్వం వారికి స్పష్టమైన హామీలను ఇచ్చినప్పటికీ, ఆ హామీలను చట్టబద్ధం చేసేంతవరకూ తాము ఉద్యమాన్ని సాగిస్తామని జాట్‌ నేతలు చెబుతున్నారు. కానీ ప్రస్తుతానికి వీరి ఆందోళనల వల్ల జనజీవనానికి మాత్రం తీవ్ర విఘాతం ఏర్పడింది. బాధిత జిల్లాలలో కూరగాయలు, పెట్రోలు, పాలు వంటి నిత్యావసర వస్తువులు లభించని స్థితి ఉంది. ఆ విషయం ఉద్యమకారులకు పట్టదు కదా!

Online Jyotish
Tone Academy
KidsOne Telugu