టీ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. ఈ పని మాత్రం చేయకండి..!
posted on Jul 16, 2025 9:30AM
.webp)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయంగా మాత్రమే కాదు, ఒక భావోద్వేగంగా మారిపోయింది. ఉదయం అయినా లేదా సాయంత్రం అలసట అయినా, అందరికీ ఒక కప్పు టీ లేనిదే రిలాక్స్ గా అనిపించదు. చాలా మంది టీని ఎక్కువసేపు మరిగిస్తారు, తద్వారా దాని రుచి చిక్కగా, రుచికరంగా మారుతుంది. అయితే ఎంతో ఇష్టంగా త్రాగే టీని, అవసరానికి మించి మరిగిస్తే అది ఆరోగ్యానికి కూడా హానికరం చేస్తుంది. చాలామంది టీ విషయంలో చేసే తప్పులు, చేయకూడని పొరపాట్లు తెలుసుకుంటూ.. టీ ని ఆరోగ్యంగా తాగాలంటే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే..
నిపుణుల అభిప్రాయం ప్రకారం టీలో కెఫిన్,టానిన్లు, యాంటీఆక్సిడెంట్లు ప్రభావవంతంగా ఉంటాయి. ఈ కారణంగా టీని పరిమిత సమయం మాత్రమే ఉడకబెట్టాలి. టీని ఎక్కువసేపు లేదా చాలా తక్కువసేపు ఉడకబెట్టడం వల్ల రుచి దెబ్బతింటుంది. అంతేకాదు.. ఇది ఆరోగ్యం పైన కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది.
త్వరగా టీ తయారు చేసి తాగితే..
అంటే 1-2 నిమిషాలు టీని ఉడకబెట్టినట్లయితే అప్పుడు టీ ఆకులలో ఉండే పోషకాలు పూర్తిగా పానీయంలో చేరదు. . ఇలాంటి టీ కూడా ఎలాంటి రుచిని, ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాన్ని ఇవ్వదు.
టీ చాలా సేపు ఉంచి మరగబెడితే..
10 నిమిషాలు లేదా ఎక్కువసేపు టీని ఉడకబెట్టినట్లయితే దానిలో టానిన్డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది టీని చేదుగా చేస్తుంది. ఇది చాలా వగరుగా కూడా ఉంటుంది. చాలామంది టీ స్ట్రాంగ్ గా ఉండాలని ఎక్కువ సేపు టీ ఉడికిస్తారు. కానీ ఈ రకమైన టీ తాగడం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం వంటి కడుపు సమస్యలు వస్తాయి.ఎక్కువగా మరిగించిన టీలో కెఫిన్ పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. దీని ద్వారాతలనొప్పి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు కూడా ఉండవచ్చు.
టీ ఎంతసేపు మరగబెట్టాలి?
ఆరోగ్య నిపుణుల ప్రకారం టీని 4-5 నిమిషాలు మాత్రమే మరిగించడం సరైనది. దీనివల్ల టీ రుచికరంగా, ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. అది పాల టీ అయినా లేదా బ్లాక్ టీ అయినా రెండూ ఎక్కువసేపు ఉడకబెట్టకూడదు . టీ తయారు చేస్తున్నప్పుడు ముందుగా నీటిని మరిగించి అప్పుడు అందులో టీ ఆకులు వేసి 2-3 నిమిషాలు మరిగించాలి. తక్కువ మంట మీద మరిగించి, రుచికి తగ్గట్టుగా పాలు, చక్కెర కలపాలి. దీని తరువాత, దానిని 1-2 నిమిషాలు మరిగించి వెంటనే వడకట్టాలి. చాలా సేపు మరగబెట్టిన టీని తాగడం వల్ల రుచి పెరుగుతుంది. కానీ ఆరోగ్యం మాత్రం మరింత దిగజారుతుంది,
అయితే గ్రీన్ టీ తాగే వారులేదా లేదా హెర్బల్ టీ తీసుకునేవారు దానిని అస్సలు ఉడకబెట్టకూడదు. గోరువెచ్చని నీటిలో వేసి మూత పెట్టి 2-3 నిమిషాలు ఆవిరిలో ఉంచాలి. దీని ద్వారా ఆరోగ్యం బాగుటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..