ముఖ్యమంత్రిపై పగబట్టిన కాకులు
posted on Jan 20, 2017 11:44AM
.jpg)
కాకులేంటి ముఖ్యమంత్రిని పగబట్టడం ఏంటి అనుకుంటున్నారా..కాని ఇది నిజం..అసలు వివరాల్లోకి వెళితే ఆ ముఖ్యమంత్రి ఎవరో కాదు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. గతంలో ఆయన అధికారిక వాహనంపై కాకి వాలడం..దానిని అపశకునంగా భావించిన సిద్దూ..కారునే మార్చేయడం దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఆ గోల ఎలాగో సద్దుమణిగిపోయింది..తాజాగా ఇప్పుడు ఓ కాకి ఆయనపై రెట్ట వేసింది. కేరళలోని కాసర్‌గాడ్ సమీపంలోని మంజేశ్వర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు సిద్ధరామయ్య.. ఆయన వేదిక మీద కూర్చొని ఉండగా ఓ కాకి సీఎంపై రెట్టవేసింది. దీనిని గుర్తించిన ఓ ఎమ్మెల్యే ఆ రెట్టను తుడిచివేశారు. అనంతరం అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది కాకిని తరిమివేశారు. అయితే పదే పదే కాకులు తనను వేంటాడటాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకున్నారు.