టార్గెట్ రిపబ్లిక్ డే
posted on Jan 20, 2017 1:45PM

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీపై ఐఎస్ఐఎస్ విరుచుకుపడే అవకాశముందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నెల 26 దేశ రాజధానిలో ఉన్న కోర్టులపై ఉగ్రవాదులు దాడులకు దిగడానికి కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ తెలిపింది. గత కొద్ది రోజులుగా ఎవరికీ చిక్కకుండా ఢిల్లీలో తలదాచుకున్న ఐఎస్ ముష్కరులు దాడులకు దిగే అవకాశముందని..ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీని వారు లక్ష్యంగా తీసుకున్నారని పేర్కొంది. అయితే ఉగ్రవాదులు చివరి నిమిషంలో తమ టార్గెట్‌ను కోర్టులతో పాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు సన్నాహలు చేస్తున్నారని హెచ్చరించింది. దీంతో ఢిల్లీ పోలీసులతో పాటు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టుతో పాటు ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది.