జల్లికట్టుకు మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్

జల్లికట్టుపై నిషేధాన్ని నిరసిస్తూ తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు తారాస్థాయికి చేరాయి..ప్రజలకు మద్ధతుగా సినీ,రాజకీయ ప్రముఖులు రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత వేడేక్కింది. తాజాగా కోలీవుడ్‌తో టాలీవుడ్ కూడా చేయి కలిపింది. ఇప్పటికే సూపర్‌స్టార్ మహేశ్ బాబు, అఖిల్ అక్కినేని జల్లికట్లుకు మద్ధతుగా ట్వీట్ చేశారు. తాజాగా పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ దీనిపై స్పందించాడు. జల్లికట్టు, కోడిపందేలను నిషేధించడం భారత ప్రభుత్వం ద్రవిడుల సంస్కృతి సాంప్రదాయాలపై దాడి చేయటమేనన్నారు. తాను తమిళనాడులోని పొల్లాచ్చిలో షూటింగ్‌లో పాల్గొన్నప్పుడు అక్కడి ప్రజల ఆవేదనను తాను ప్రత్యక్షంగా తెలుసుకున్నా అన్నారు. జంతువులను హింసిస్తున్నారన్న కారణంతో జల్లికట్టును ప్రభుత్వం నిషేధించింది. నిజంగా ప్రభుత్వానికి అలాంటి ఆలోచన ఉంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న పౌల్ట్రీ బిజినెస్, బీఫ్‌ ఎగుమతుల మీద చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu