గిల్ ద డబుల్
posted on Jul 3, 2025 8:41PM

ఐదు మంది సెంచురీలు చేసినా ఫస్ట్ టెస్ట్ లో ఓటమి భారత్ కి అత్యంత చెత్త రికార్డును తీసుకొచ్చి పెట్టింది. గిల్ కెప్టెన్సీలోని టీమిండియా. ఇంగ్లండ్ తో ఐదు టెస్టుల సీరీస్ లో రెండో టెస్ట్ లో ఎలాగైనా సరే విజయం సాధించాలన్న గట్టి పట్టుదలతో ఆడుతున్నాడు యంగ్ కెప్టెన్ శుభ్ మన్ గిల్. తొలి టెస్టులో సెంచురీ చేసిన గిల్. రెండో టెస్టులో డబుల్ సెంచురీ ,అది కూడా ఆట ముగిసే సమయానికి నాట్ అవుట్ గా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులను మోత మోగించాడు.
ఇంగ్లండ్ లో ఒక కెప్టెన్ గా 179 పరుగుల హయ్యస్ట్ స్కోర్ రికార్డు అజర్ పేరిట ఉండేది. 1990 ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు అజర్. ఇపుడా రికార్డు క్రాస్ చేశాడు గిల్. అంతేనా విరాట్ కోహ్లీ తర్వాత విదేశీ గడ్డపై డబుల్ బాదిన రెండో కెప్టెన్ కూడా గిల్లే. SENA దేశాల్లో శతకం చేసిన ఆరో ఏషియన్ కెప్టెన్ గానూ నిలిచాడు. టెస్టుల్లో డబుల్ చేసిన ఆరో కెప్టెన్ గా మరో రికార్డు సృష్టించాడు. 2003 తర్వాత ఇంగ్లండ్ పై ద్విశతం చేసిన తొలి విదేశీ ఆటగాడు కూడా గిల్లే. మొత్తం మీద ఇంగ్లండ్ బౌలర్లను తన దైన బ్యాటింగ్ పెర్ఫామెన్స్ తో ఒక ఊపు ఊపేస్తున్నాడు కెప్టెన్ గిల్. త్రిశతం(300) కూడా బాదేసి సెహ్వాగ్ పేరిట ఉన్న టెస్ట్ హయ్యస్ట్ ఇండియన్ ప్లేయర్ రికార్డు కూడా తిరగరాసే అవకాశం ఉంది.