రాష్ట్రంలో ఎక్కడికైనా మహిళలకు ఉచిత ప్రయాణం : మంత్రి మండిపల్లి
posted on Aug 4, 2025 5:45PM

ఏపీలో ఎక్కడికైనా మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయవచ్చాని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ‘శ్రీ శక్తి’ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ ఇలా మొత్తం 6,700 బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇందుకోసం ప్రభుత్వం 1,950 కోట్లు ఖర్చు అవుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలకు ఎన్నో స్కీములు చెప్పామని, దానిలో ఉచిత బస్సు పథకాన్నికి మహిళలు మొగ్గు చూపారు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుండి ఎక్కడికయినా జీరో టికెటింగ్ విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్, అల్ట్రా ఎక్స్ ప్రెస్‌లలో కూడా ఈ పథకం అమలులో ఉటుందని మంత్రి స్పష్టం చేశారు.