పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం..నలుగురికి సీరియస్

 

అనకాపల్లి జిల్లాలో పరవాడ ఫార్మాసిటీలో  ప్రమాదం చోటుచేసుకుంది. లూపిన్ ఫార్మా కంపెనీలో విషవాయువులు లీకవ్వడంతో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వెంటనే స్థానికులు అప్రమత్తమై అస్వస్థతకు గురైన కార్మికులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

ప్రమాదంలో లూపిన్ ఫార్మా యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమవారం తెల్లవారు జామున ప్రమాదం జరిగింది.  అయితే ఈ ప్రమాదాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచింది. ప్రమాదంలో అస్వస్థతకు గురైన వారిలో సాయి షిఫ్ట్ ఇంచార్జ్, గణేష్ కెమిస్ట్, రాఘవేంద్ర, నాయుడులను షీలా నగర్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో నలుగురు చికిత్స పొందుతున్నారు. మిగిలిన ఇద్దరు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu