ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న బాంబులు నిర్వీర్యం
posted on Jul 3, 2025 9:01PM

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను పోలీసులు నిర్వీర్యం చేశారు. 30 ఏళ్లుగా పట్టణంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాదులు అబూ బకర్ సిద్ధిక్ అమానుల్లా పేరుతో, మహమ్మద్ అలీనీ ఐబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద దొరికిన సుట్ కేసు బాంబు బకెట్ బాంబులను రాయచోటి కార్యాలయం పక్కన ఆక్టోపస్ పోలీసులు పేల్చేశారు.
తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలు ఉండడంతో అరెస్టు చేసిన ఇరువురి ఇళ్లను సోదాలు చేశామని, భారీ మొత్తంలో విస్పోటక పదార్థాలు స్వాధీనం చేసుకున్నామని కర్నూలు రేంజ్ డి.ఐ.జి డాక్టర్ కోయ ప్రవీణ్ తెలిపారు. వీరు ఆల్ ఉమ్మా అనే తీవ్రవాద సంస్థతో అనుబంధం కలిగి వున్నారన్నారు. అన్నమయ్య జిల్లా పోలీసుల చొరవతో ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేయడంలో విజయం సాధించామన్నారు.