ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశంలో తెలంగాణా రాష్ట్ర అతిథిగా శివనాగిరెడ్డి

195 దేశాలు పాల్గొంటున్న భారతదేశం ఆతిథ్యమిస్తున్న 46వ ప్రపంచ వారసత్వ కమిటీ సమావేశాలకు పురావస్తు పరిశోధకుడు, వారసత్వ పరిరక్షణ నిపుణుడు, ప్లీచ్‌ ఇండియా పౌండేషన్‌, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని  తెలంగాణా ప్రభుత్వం రాష్ట్ర అతిథిగా నామినేట్‌ చేసింది. ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న ఈ సమావేశాల్లో ఆయన 29,30 తేదీల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.

యునెస్కో సభ్యదేశాలు, తమ దేశాలకు చెందిన పురాతన స్థలాలు, కట్టడాలు, సుందరతర ప్రకృతి ప్రదేశాలకు ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం పంపే ప్రతిపాదనలను ఈ సమావేశాల్లో చర్చించి, అప్పటికే తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకొన్న వాటిపై ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తికరంగా సాగే చర్చల ద్వారా, కొత్త ప్రతిపాదనల నివేదికల తయారీకి అవసరమైన నైపుణ్యాన్ని సంతరించుకొనే వీలు చిక్కిందని శివనాగిరెడ్డి చెప్పారు. 

తనతో పాటు వారసత్వ నిపుణులు, వాస్తు శిల్పులు (ఆర్కిటెక్ట్‌లు) మణికొండ వేదకుమార్‌, ఎం.పాండురంగరావు, డాక్టర్ శోభ,  ప్రొఫెసర్ కె.పి. రావు, డాక్టర్ పద్మనాభలను తెలంగాణా ప్రభుత్వం నామినేట్‌ చేసిందని శివనాగిరెడ్డి తెలిపారు.  తనకు అవకాశమిచ్చిన తెలంగాణా ప్రభుత్వ పర్యాటకశాఖ ముఖ్య కార్యదర్శికి, ప్రభుత్వానికి శివనాగిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu