శిల్పాచౌద‌రి క్రైం లీల‌లు మామూలుగా లేవుగా.. ఆమె చాలా ముదురు..

అడ‌గ్గానే అప్పు ఇచ్చేయాలి. అడిగినంత చేతిలో పెట్టేయాలి. అలా జ‌ర‌గాలంటే, మ‌నం చాలా రిచ్ అని అంద‌రికీ తెలియాలి. స‌రిగ్గా ఇదే స్ట్రాట‌జీ ఫాలో అయ్యారు శిల్పాచౌద‌రి. ద‌ర్పంగా, ద‌ర్జాగా క‌నిపించేలా బిల్డ‌ప్ ఇచ్చారు. సంప‌న్నులు నివాసం ఉండే హైద‌రాబాద్‌లోనే ఖ‌రీదైన గండిపేట‌లోని సిగ్నేచ‌ర్ విల్లాస్‌లో మ‌కాం వేశారు. కోటీశ్వ‌రులా క‌నిపించ‌డానికి ఖ‌రీదైన ప‌ట్టు చీర‌లు క‌ట్టేవారు. క‌ట్టిన చీర క‌ట్ట‌కుండా.. క‌లరింగ్ ఇచ్చేశారు. ప్రత్యేక ఫ్యాషన్‌ డిజైనర్‌ను కూడా నియమించుకుంది. ఒంటినిండా బంగారం. పెద్ద పెద్ద ఆభ‌ర‌ణాలు. అయితే, అవ‌న్నీ గిల్ట్ న‌గ‌లు అని అనుమానం రాకూడ‌దు.  ప‌రీక్ష చేసి చూస్తే కానీ అవి రోల్డ్‌గోల్డ్ అని తెలీకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు.  

ఇక కోట్ల‌లో అప్పు రాబ‌ట్టాలంటే.. ఇచ్చేవారూ కోటీశ్వ‌రులై ఉండాలి. అందుకే, డ‌బ్బు బాగా ఉండే సినీ ఫ్యామిలీస్‌ను టార్గెట్ చేసుకున్నారు. వ్యాపారవేత్త‌లు, రియ‌ల్ ఎస్టేట్ వాళ్ల‌ను వ‌ల‌లో వేసుకున్నారు. అంతా మ‌హిళ‌లే టార్గెట్‌. వారిని అట్రాక్ట్ చేసేలా.. వీకెండ్ కిట్టీ పార్టీల పేరుతో ఖ‌రీదైన పార్టీలు ఇచ్చేవారు. 

గండిపేటలోని సిగ్నేచర్‌ విల్లాలో పదేళ్లుగా నివాసముంటున్నారు శిల్పాచౌదరి, శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ దంపతులు. తమకు తాము ధనవంతులుగా ప్రకటించుకున్నారు. టీవీ, సినీ నిర్మాతగా పరిచయం చేసుకున్న శిల్పాచౌదరి.. సినీప్రముఖుల కుటుంబాల్లోని మహిళలను ప‌రిచ‌యం చేసుకున్నారు. వీకెండ్‌ పార్టీల పేరుతో తొలుత కొంతమందితో మొదలైన కిట్టీ పార్టీలను తర్వాత జూదంగా మార్చేశారు. దివానోస్‌ పేరుతో క్యాసినో స్టార్ట్ చేశారు. సంపన్న కుటుంబాలకు చెందిన 90 మంది మ‌హిళ‌ల‌ను సభ్యులుగా చేర్పించుకున్నారు. వారాంతాల్లో విందులు, వినోదాల పేరుతో జ‌ల్సాలు చేయిస్తూ.. అప్పుల పేరుతో డ‌బ్బులు లాగేసేవారు. హీరో మహేశ్‌బాబు సోదరి ప్రియదర్శిని నుంచి 2 కోట్లు వ‌సూలు చేశారు. ఓ యువ‌హీరో భార్యను 3 కోట్లుకు మోసం చేశారు.  

స‌ర్కారు వారి దెబ్బ‌.. రూ.5కే అఖండ సినిమా.. ముందుంది ముస‌ళ్ల పండుగ‌..

విచార‌ణ‌లో భాగంగా శిల్పాచౌద‌రికి చెందిన రెండు అకౌంట్లను పోలీసులు ఫ్రీజ్‌ చేశారు. అయితే వాటిలో అంతగా డబ్బు లేదని తెలిసింది. దీంతో మ‌రి కొల్ల‌గొట్టిన కోట్ల‌న్నీ ఆమె ఎక్కడికి తరలించారనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. హ‌వాలా మార్గంలో విదేశాల‌కు 50 కోట్లు పంపించార‌ని అంటున్నారు. మ‌రోవైపు, శిల్పాచౌదరి భర్త శ్రీకృష్ణ శ్రీనివాస్‌ ప్రసాద్‌ స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నాడన్న సమాచారంతో ఆయ‌న‌ ఎక్కడెక్కడ భూములు కొన్నారన్న వివరాలను సేకరిస్తున్నారు.