తెలంగాణ వచ్చేస్తుంది. జానారెడ్డి - తెలంగాణ రాదు. జగ్గారెడ్డి
posted on Dec 3, 2012 10:08AM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం పై తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే....మరికొంతమంది తెలంగాణ ఇవ్వొంద్దంటూ విజ్ఞప్తి చేస్తామంటున్నారు. మరికొందరు నేతలు మాత్రం రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని అభిప్రాయపడుతున్నారు.
ఇదే అంశంపై జానారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ వచ్చేస్తుంటే ఫ్రంట్ ల అవసరం ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణ కి ముఖ్యమంత్రి పదవితో పాటు... ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినా తనకు ఆనందమేనన్నారు. మంత్రి దామోదర్ రెడ్డి మాత్రం తెలంగాణ నేతలంతా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి, బయటకు వచ్చి ఫ్రంట్ కట్టాలని, అందుకోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
మరోవైపు జగ్గారెడ్డి మాట్లాడుతూ తమకు అసలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, ఇందుకు సంబందించిన వివరాలతో ఢిల్లీ కి వెళ్లి అధిష్టానానికి వివరిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయవద్దని వారిపై ఒత్తిడి తెస్తానని చెప్పారు.