భద్రాచలం వద్ద గోదావరి వరద.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
posted on Aug 31, 2025 11:24AM
.webp)
గోదావరికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. ఇక్కడ గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఆదివారం ఉ(ఆగస్టు 31) ఉదయం 9 గంటల సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 48 అగుడులు దాటింది.
దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే భద్రాచలం వద్ద స్నాన ఘట్టాల మెట్లు నీట మునిగాయి. భక్తులు ఎవరూ గోదావరిలో స్నానాలకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ఇలా ఉండగా వరద ఉధృతితో తూరుబాక వద్ద ప్రధాన రహదారి నీట మునిగింది. దీంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే పలు ఏజెన్సీ మండ లాలు ముంపునకు గురయ్యాయి. వీఆర్ పురం, కూనవరం, చింతూరులు జలదిగ్బంధంలో ఉన్నాయి.