భోగి సంబరాల్లో మంత్రుల కోలహలం
posted on Jan 14, 2026 10:12AM

ఏపీలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. అనకాపల్లి జిల్లా నర్నీపట్నంలో జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. తెలుగు భాషా సంస్కృతులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. నక్కలపల్లిలో హోంమంత్రి అనిత డప్పు వాయించి సందడి చేయగా చేశారు. కుటుంబసభ్యులతో కలిసి ఆమె భోగి మంటలు వేసి సందడి చేశారు. అనంతరం గో పూజ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ఏర్పాటు చేసిన కేరళ డప్పులను హోంమంత్రి కొద్దిసేపు వాయించి అందరిలో ఉత్సాహం నింపారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం పెదఅమిరంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు నివాసం వద్ద భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో రాజకీయ ప్రముఖులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అధికారులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారునెల్లూరు జిల్లాలో పెద్దఎత్తున భోగి సంబరాలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన భోగి సంబరాల్లో మంత్రి నారాయణ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఎంపీ శాస్త్రోక్తంగా పూజలు చేసి భోగి మంటలు వెలిగించారు. ఈ వేడుకల్లో టీడీపీ నేతలు గద్దె అనురాధ, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు