పొంగల్ వండిన ప్రధాని మోదీ

 

ఢిల్లీలోని కేంద్రమంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పొంగల్‌ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.  తొలుత ప్రత్యేక పూజా కార్యక్రమాలను ప్రధాని నిర్వహించారు. అనంతరం ఆయనే స్వయంగా పొంగల్‌ వండారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గోవులకు పూజ చేశారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతు  వెయ్యి సంవత్సరాల పురాతనమైన గంగైకొండ చోళపురం ఆలయ సందర్శన, పంబన్ వంతెన ప్రారంభోత్సవ సమయాల్లో తమిళుల చరిత్ర గొప్పతనాన్ని తెలుసుకున్నట్లు పేర్కొన్నారు.

 కొన్ని నెలల క్రితం సహజ వ్యవసాయంపై తమిళనాడులో జరిగిన ఓ సమావేశానికి తాను హాజరైనట్లు ప్రధాని తెలిపారు. అక్కడ లాభదాయకమైన వృత్తులను వదిలి వ్యవసాయం వైపు మళ్లిన యువతను కలిశానని,   వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకురావడానికి వారు చేస్తున్న కృషిని మరింత విస్తరించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పొంగల్ వేడుకల్లో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. మరోవైపు ఈ పొంగల్ వేడుకను పలువురు ప్రముఖులు ఘనంగా జరుపుకుంటున్నారు. అలానే దేశ వ్యాప్తంగా ప్రజలు వివిధ రకాల వంటకాలు చేసుకుని, ఇళ్లను అలకరించుకుని పండగను ఘనంగా జరుపుకుంటున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu